పల్లవి:
మెరిసే తారలదే రూపం
విరిసే పువ్వులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
చరణం1:
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంతమాసపు కులగోత్రాలను యెలకోయిల అడిగేనా
ఎవరి పిలుపులు పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలనకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
చరణం2:
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి, ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణస్పందన
నీకే నా హృదయనివేదన
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
|
No comments:
Post a Comment