గాత్రం:సుశీల
సంగీతం:కెవి.మహదేవన్
సాహిత్యం:ఆత్రేయ
నిర్మాత:విబి.రాజేంద్రప్రసాద్
దర్శకత్వం:మధుసూధనరావు
సంస్థ:జగపతి పిక్చర్స్
పల్లవి:
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

ఉన్న మనసు నీకర్పణ చేసి లేనిదాననైనాను ఏమి లేని దాననైనాను
చరణం1:
కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి

రెండు లేకా పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి
ఇంకెందుకు నాకీ కనుదోయి
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
చరణం2:
కదిలే శిలలా మారిపోతిని కధగానైనా మిగలనైతిని

నిలువున నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని
నిరుపేదగ నే నిలిచిపోతిని
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
ఉన్న మనసు నీకర్పణ చేసి లేనిదాననైనాను ఏమి లేని దాననైనాను
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
|
No comments:
Post a Comment