పల్లవి:
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య
కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య
తెల్లవారెనురా విహగాలి లేచెనురా
తెల్లవారెనురా విహగాలి లేచెనురా
అల్లదే ఉదయాద్రి పైన
అల్లదే ఉదయాద్రి పైన అరుణకాంతి విరిసెరా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య
చరణం1:
చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
చల్ల చిలికే భామల కంకణాల మోతలవిగో
జుమ్మని నిను లెమ్మని
జుమ్మని నిను లెమ్మని పిలిచేను తేటి తియ్యగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య
చరణం2:
పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
పసిడి వాకిటిలో విరజాజి మాలలతో
దాసకోటి వేచినారు
దాసకోటి వేచినారు నీకు సేవలు చేయగా
మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్య
|
No comments:
Post a Comment