పల్లవి:
ఉపకార చింతే నేరమా
కరుణే నిషేదమా
నిలాపనిందలే ఈ లోక నైజమా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు

చరణం1:
పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
చరణం2:
నా మనసు ,నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు
|
No comments:
Post a Comment