హే ముత్యమల్లే మెరిసిపొయే మల్లెమొగ్గా
ఆరె ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
ఊరు నిదరొయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
చరణం1:
కురిసే సన్నని వానా సలి సలిగా వున్నది లోన
కురిసే సన్నని వానా సలి సలిగా వున్నది లోన
గుబులౌతుందే గుండెల్లొనా
జరగనా కొంచం నే నడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందాము మనమూ
హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ వుండిపోవే
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
చరణం2:
పండే పచ్చని నేల అది బీడై పొతే మేలా
పండే పచ్చని నేల అది బీడై పొతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మల్లా
ఉరికె పరువమిది మనదీ
హే కాపుకొస్తే కాయలన్నీ జారిపొవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపొవా
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
చరణం3:
నవ్వని పువ్వే నువ్వు నును వెచ్చని తేనెలు ఇవ్వు
దాగదు మనసే ,ఆగదు వయసే
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు
ఇద్దర మొకటవనీ కానీ
హే బుగ్గమీద మొగ్గలన్నీ దూసుకొనీ
రాతిరంతా జాగారమే చెసుకొనీ
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిసిందిలే
ఊరు నిదరొయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మంచి చోటే మనకు కుదిరిందిలే
|
No comments:
Post a Comment