గాత్రం:ఘంటసాల,భానుమతి
సంగీతం:సి వి.సుబ్బరామన్
సాహిత్యం:సముద్రాల
నిర్మాత:పి.రామకృష్ణారావు
దర్శకత్వం:భానుమతి
సంస్థ:భరణి పిక్చర్స్
విడుదల:1956
పల్లవి:
ఓ తారక ఓ
ఓ జాబిలి ఓ
ఓ తారక నవ్వులేల ననుగని
ఓ తారక నవ్వులేల ననుగని
ఓ తారక నవ్వులేల ననుగని
అందాలు చిందెడి చందమామ నీవని
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని
చరణం1:
వినువీధిలోని తారాకుమారి
దరిచేరెనౌనా ఈ చందమామ
చేరువె తార రేరాజుకు
ఆ తారక నవ్వునోయి నినుగని
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని
చరణం2:
మనోగాధ నీతో నివేదించలేను
నివేదించకున్న జీవించలేను
నెరజాణవేలే ఓ జాబిలి
ఓ ఆ తారక నవ్వునోయి నినుగని
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని
చరణం3:
తొలిచూపులోని సంకేతమేమో
చెలి నవ్వులోని ఆ శిల్పమేమో
నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలి
ఓ ఆ తారక నవ్వునోయి నినుగని
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని
|
No comments:
Post a Comment