Dec 30, 2007

ఆదిత్య 369

తారాగణం:బాలకృష్ణ,మోహిని,సిల్క్‌స్మిత
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గాత్రం : జిక్కి,బాలు ,శైలజ
సంగీతం:ఇళయరాజా
నిర్మాతలు:అనిత కృష్ణ,బాలసుబ్రహ్మణ్యం
దర్శకత్వం:సింగీతం శ్రీనివాసరావు
సంస్థ:శ్రీదేవి ఆర్ట్స్
విడుదల:1991


పల్లవి:

నెరజాణవులే వరవీణవులే కిలికిన్చితాలలో ఆహహ
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గని మొగ్గగనీ మోజు పడిన వేళలో
జాణవులే వరవీణవులే కిలికిన్చితాలలో ఆహహ
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

చరణం1:

మోమటు దాచి మురిపెము పెంచే లాహిరిలో ఆహహహ ఒహొహొహొ
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికలా వూగే వుయ్యాల
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈవేళ
మర్యాదకు విరి పానుపు సవరించవేమిరా

జాణవులే వరవీణవులే కిలికిన్చితాలలో ఆహహ
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గని మొగ్గగనీ మోజు పడిన వేళలో
జాణవులే వరవీణవులే కిలికిన్చితాలలోఆహహ
నెరజాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

చరణం2:

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో ఆహహహ ఒహొహొహొ
వెన్నెల తాపం వయసుకు ప్రాణం యీ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి వొక న్యాయమింక సాగునా

జాణవులే వరవీణవులే కిలికిన్చితాలలో ఆహహ
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గని మొగ్గగనీ మోజు పడిన వేళలో
జాణవులే వరవీణవులే కిలికిన్చితాలలో
ఆహహ జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

||

No comments: