పల్లవి:
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
బంగారు కాంతులేవొ నేడే తొంగిచూసేను
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
చరణం1:
తోడునీడా నీవై లాలించే అన్నయ్య
తోడునీడా నీవై లాలించే అన్నయ్య
తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్య
నీకన్న వేరే పెన్నిధి లేనేలేదు
నా పూర్వపుణ్యాల రూపమే నీవు
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
చరణం2:
రతనాల సుగుణాల రాశివి నీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
రతనాల సుగుణాల రాశివి నీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్లు
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
బంగారు కాంతులేవొ నేడే తొంగిచూసేను
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
చరణం3:
మా అన్నయ్య మనసే సిరిమల్లెపువ్వేను
మా అన్నయ్య మనసే సిరిమల్లెపువ్వేను
చెల్లి కంట తడివుంటే తల్లడిల్లేను
నీ పూజలే నన్ను నడిపించు తల్లి
శతకోటి విజయాలు సాధించు చెల్లి
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
బంగారు కాంతులేవొ నేడే తొంగిచూసేను
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
|
No comments:
Post a Comment