Dec 1, 2007

శ్రీనివాస కళ్యాణం

గాత్రం:బాలు,సుశీల


పల్లవి:

జాబిలి వచ్చి జామయ్యింది జాజులు విచ్చి జామయ్యింది
తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయ్యింది గోలయ్యింది
జాబిలి వచ్చి జామయ్యిందా జాజులు విచ్చి జామయ్యిందా
తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయిందా గోలయిందా
జాబిలి వచ్చి జామయ్యింది జాజులు విచ్చి జామయ్యింది

చరణం1:

పందిరిమంచం ఒంటరి కంటికి కునుకునివ్వనంది
అహా వరసకుదరినిదే సరసానికి తెరతీయకూడదంది
పందిరిమంచం ఒంటరి కంటికి కునుకునివ్వనంది
హహ వరసకుదరినిదే సరసానికి తెరతీయకూడదంది
వడ్డించిన అందాలన్ని అడ్డెందుకు అంటున్నాయి
వడ్డించిన అందాలన్ని అడ్డెందుకు అంటున్నాయి
కళ్యాణం కాకుండానే కలపడితే తప్పన్నాయి

జాబిలి వచ్చి జామయ్యింది జాజులు విచ్చి జామయ్యింది
తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయిందా గోలయిందా
జాబిలి వచ్చి జామయ్యింది జాజులు విచ్చి జామయ్యిందా

చరణం2:

అత్త బిడ్డనా హక్కు చూపుతు రేచ్చేవబ్బాయి
మరదలివైతె ఏనాడో గిరి దాటించేద్దునె అమ్మాయి
అత్త బిడ్డనా హక్కు చూపుతు రేచ్చేవబ్బాయి
మరదలివైతె ఏనాడో గిరి దాటించేద్దునె అమ్మాయి
హె కొంగుముళ్ళు పడకుండానే కొంగుముదిరి పోనీకోయి
హె కొంగుముళ్ళు పడకుండానే కొంగుముదిరి పోనీకోయి
దొంగ ముద్దుల తీయదనంలొ సంగతేదొ తెల్చేయ్యనీయి

ఆ ఆహా హహ
జాబిలి వచ్చి జామయ్యింది జాజులు విచ్చి జామయ్యిందా
తాపం పెంచే ఉడుకు దుడుకు ముడిపడి ఉరికే వేళయ్యింది గోలయ్యింది
జాబిలి వచ్చి జామయ్యిందా జాజులు విచ్చి జామయ్యింది


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: