తారాగణం:శరత్ బాబు
గాత్రం:వాణిజయరాం,ఎస్ పి.శైలజ
సాహిత్యం:వేటూరి
సంగీతం:కె.వి.మహాదేవన్
పల్లవి:
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
తారనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
చరణం1:
సత్యలోకమున భారతికి కైలాసమ్మున పార్వతికి సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందేహం
ఆదిదేవుడు ,బ్రహ్మదేవుడు సతులనుగూడి వైకుంఠం చేరివిష్ణువుకు వెల్లడించిరి తమ తమ భార్యల సందేహం
చిరు చిరు నగవులు చివురులెత్తగా ముగురమ్మలకు దిగులు పుట్టగా
మహాపతివ్రత సతి అనసూయని మహావిష్ణువే వివరించే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అలిగిన భామలు సతి అనసూయను పరీక్షించమని అడుగగా
ఎరిగిన తండ్రులు ఎరుక దాచుకొని అత్రి ఆశ్రమం చేరి
భవతి భిక్షాందేహియని నగ్నదేహిగా వడ్డించమని ముగ్గురతిధులై ముంగిట నిలువ
ముసిముసి నవ్వుల వారి గని పసి పాపలుగా మార్చుకొని
భూతభవిష్యత్ వర్తమానముల మాతృజన్మ ఈడేర్చుకొని
మహాపతివ్రత అనసూయమ్మ హరిహరబ్రహ్మల ముద్దాడే
ఊయలలో తమ పతులగని
ఊయలలో తమ పతులగని ఉమకి,రమకి,భారతికి
అయిదోతనమే అయోమయంలో ఊగిసలాడెను ఒక్క క్షణం
ఉం ఉం ఉం ,ఉం ఉం ఉం
అపుడు పార్వతి,లక్ష్మి,సరస్వతులు మహాసాధ్వియైన అనసూయను పతిభిక్షపెట్టమని ప్రార్ధించగా ఆమె కరుణించి ఆ వరమిచ్చి ఆ త్రిమూర్తుల అంసతో తమకొక కుమారుణ్ణి ప్రసాధించమని కోరింది
అత్రికి దత్తుడు దత్తాత్రేయుడు అనసూయమ్మకు ప్రియ సుతుడై జననమందగా
చతుర్వేదములు శునకములై అనుసరించగా
దేవ ధుందుభులు మొరసినవి
ధుమ మేగాలే కురిసినవి
వేదాంతానికి ఆదిభాస్యమై వెలుగురేకలే మెరిసినవి
సుమసుకుమారుడు దత్తాత్రేయుడు లీలావతినే పెళ్ళాడి
యవ్వనలీలా రాగమాలికల రాసలీలలే ఆడే
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
చరణం2:
లోకకంఠకుడు మహిషాసురినె లోకమాత వధియించగా
పతి శాపమ్మున్న పశువుగ పుట్టిన మహిషే పట్టమహిషిగా
శుక్రాచార్యుని ఆనతితో సక్ర పరాభవమే తన గురిగా
రాక్షషకుల రక్షణ తనవిధిగా తపోదీక్షలో మునిగెను మహిషి తపోదీక్షలో మునిగెను
మహిషి తపస్సుకు మహి అల్లాడెను
దివిజలోకమే గిరగిర తిరిగెను
పాతాళపు భేతాళ ఘోషలే దశదిశాంతమ్ములు దద్దరిల్లెను
కాలమాగెను, నింగి రాలెను, చుక్కలు నెత్తురు కక్కసాగెను
ఒళ్ళంతా కళ్ళైన ఇంద్రునికి కన్నీరే అభ్యంగమాయెను
అపుడు మదనుడు కన్నులు తుడిచి ఆ దేవేంద్రుని ఊరట పరిచి
మహిషి తపమ్మును భంగపరచగా మహిషి చేరెను తక్షణమే
మహిషి చేరెను తక్షణమే
బ్రహ్మ వరమ్మున బలదర్పమ్ములు శృతులుమించిన ఆ మహిషి
సూర్యుని తన్నెను,చంద్రుని కుమ్మెను
గగన వీధిలో గంతులేసెను
మహీచక్రములు మత్తగించెను ఇంద్ర పదవినే ఆక్రమించెను
మదమెక్కెన మహిషికింక మగడొకడే అని తెలిసిన అరుని మనోవీధిలో మెరిసెను దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు
శుక్రాచార్యుని మిధునయాగమున కామజ్వాలలే అవతరించగా
మహిషిని పట్టిన కామప్రకోపం మండిపోయింది సమిధగా
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
చరణం3:
మోహినిపై మరులుగొన్న శివలాహ్యం
శివహృదయపు లయలుగన్న హరిలావణ్యం
మోహినిపై మరులుగొన్న శివలాహ్యం
శివహృదయపు లయలుగన్న హరిలావణ్యం
కనులారా కనగలిన అద్వైతం
ఉదయించిన ధర్మశాస్ర జీవనగీతం
మోహినిపై మరులుగొన్న శివలాహ్యం
పూర్ణతో పుష్పలతో అతని వివాహం అసంపూర్ణమైనది అతని ప్రణయజీవితం
శివునానతి తలదాల్చి భువిలో జనియించే శాస్త లేకుంటే లేదుకద మహిషి కధ వధ
మోహినిపై మరులుగొన్న శివలాహ్యం
పద్మదల రాజ్యాధినేత ఆ మాందాత వేటలాడె వేడుకను సాగిరాగ
పోరాట వీదేశ కృరమృగ మధ్యస్థ గిరి కందరాన ఒక పసికేక వినిపించె
శిశు రోదనము విన్న శ్రీమహీపాలకుడు పసిమహావిష్ణువై
శిశువైన శివుడిలా బాలార్ధ తేజానకల బాలకుని చూచి ఆచర్యచకితుడై అనురాగచలితుడై
బిడ్డపాపలు లేక గొడ్డుపోయిన జన్మ అది మహాఫలముగా అరుదైన వరముగా
భావించి బాలకుని ఎత్తుకొని ముద్దాడి తనయుడని ఉప్పొంగి తన రాణికివ్వగా
మణిబాలతో ఇంటి మణిదీపమై వచ్చి మణికంఠుడను పేర పెరిగే బాలకుడు
గురుకుల విధ్యాభ్యాషంలో చెరసంధాన ప్రయోగంలో సకలశాస్రముల సర్వశస్త్రముల పండితుడయ్యెను పసివాడు
గురుదక్షిణగా గురుపుత్రునికే వెలుగునిచ్చె మణికంఠుడు
ఇదే సమయమని మహిషి మర్ధనకు ఇదే తరుణమని పందలరాణి శిరోభారమును కల్పించెను దేవేంద్రుడు
రాజవైద్యుడుగా తానే వచ్చి పులిపాలు తప్ప ఆ వ్యాధికి మందేలేదని చెప్పగా
తల్లి భాదకు తల్లడిల్లిన ఆ మణికంఠుడు పాలుతెత్తునని గోరాడవికే బయలుదేరెనపుడు
కారణజన్ముడు మణికంఠుడికీ జన్మరహస్యం చెప్పె ఇంద్రుడు
కర్మవీరుడై ఖడ్గహస్తుడై కాలరూపుడై బాలవీరుడు మహిషిని వధియించగా
మనసా శిరసా నమస్కరించెను మహేంద్రుడు
మహిలో దివిలో వెల్లివిరిసెను కాంతిరేఖలు
శివచ్చ హృదయం విష్ణుహు
విష్ణోచ్చ హృదయగం శివహ
సంధ్యావందన గీతం శివకేశవుల అనుబంధం
ఆదిశంకరుల అద్వైతం అదే శబరిగిరీసుని అవతారం
అదే శబరిగిరీసుని అవతారం
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
తారనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి
--------------------------------------
--------------------------------------
No comments:
Post a Comment