Dec 9, 2007

రుద్రవీణ


పల్లవి:

ఒంటరిగ దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది
మంచైన చెడ్డైన పంచుకోను మేలైన
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
ఎవ్వరితో ఈ మాత్రం పంచుకొని వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
గుండెల్లో సుడి తిరిగే కలత కధలు
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

చరణం1:

కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నే ఏకాకిని
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నే ఏకాకిని
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
పాత బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
బ్రతుకు పుస్తకంలొ ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

చరణం2:

ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచెనకు మొడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక వున్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల
కళ్ళువున్న కబోదిలా చెవులున్నా బధిరుడిలా
నుతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

చరణం3:

అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే అర్తుల ఆరని శోకం
ఎడారి బతుకుల నిత్యం చస్తూ సాగే భాదల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటు నాకు నేనే హద్దనుకుంటూ
కలలొ జీవుంచను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపొతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాధ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతి మనిషికి జీవనంలొ నందనం వికసించుదాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం

Get this widget | Track details | eSnips Social DNA

No comments: