తారాగణం:జగ్గయ్య,కృష్ణకుమారి
గాత్రం:ఘంటసాల
సంగీతం:పెండ్యాల
నిర్మాత & దర్శకత్వం:తిలక్
విడుదల:1965
పల్లవి:
కొండగాలి తిరిగిందీ ఈ ఈ ఈ ఈ
కొండగాలి తిరిగిందీ
గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది ఆ ఆ ఆ ఆ ఆ
చరణం1:
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాత్యమాడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాత్యమాడింది
పట్టరాని లేతవలపు పరవశించి పాడింది
కొండగాలి తిరిగిందీ
గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం2:
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లిపూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
కొండగాలి తిరిగిందీ
గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది ఆ ఆ ఆ ఆ ఆ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment