Dec 19, 2007

రుణానుబంధం

సంగీతం:ఆది నారాయణరావు
సాహిత్యం:సముద్రాల
గాత్రం:జమునారాణి,పి బి .శ్రీనివాసరావు




పల్లవి:

ఓ అందమైన బావ... వహ్వ వహ్వ
ఆవుపాల కోవా ... వారేవా
విందుగా పసందుగా ప్రేమనందుకోవా
ఓ అందమైన బావ... ఓయ్
ఆవుపాల కోవా... హాయ్
విందుగా పసందుగా ప్రేమనందుకోవా...కోను
అందమైన బావ వా

చరణం1:

ఓ హాటు హాటు గారి
వెరీ వెరీ సారి
స్వీటు స్వీటు బూరి
వై వై హర్ర్య్
హాటు హాటు గారి స్వీటు స్వీటు బూరి
వలపు తలపు కలిపి వండినా...అమ్మోయ్
రాగాల రవ్వట్టు భోగాల బొబ్బట్టు
రాగాల రవ్వట్టు భోగాల బొబ్బట్టు
నా ప్రేమ పెసరట్టు భుజించవా
ఓ మై గాడ్

ఓయ్ అందమైన బావ ఓయ్ ఆవుపాల కోవా హాయ్
విందుగా పసందుగా ప్రేమనందుకోవా... కోను
అందమైన బావ

చరణం2:

ఓయ్ నిన్ను కోరి వచ్చా... ఛఛ
కన్నెమనసు ఇచ్చా ... చచ్చా
నిన్ను కోరి వచ్చా కన్నెమనసు ఇచ్చా ..మెచ్చా
మెచ్చావ బావయ్య నచ్చావు లేవయ్య
మెచ్చావ బావయ్య నచ్చావు లేవయ్య
చచ్చినా పోనయ్య అంతేనయ్య ... అయ్యబాబొయ్

ఓయ్ అందమైన బావ ఓయ్ ఆవుపాల కోవా హాయ్
విందుగా పసందుగా ప్రేమనందుకోవా... కోను
అందమైన బావ
ఉహు ఉహు నో నో బై బై


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

హృదయ బృందావని said...

తప్పకుండా విని పోస్ట్ చేస్తా విహారిగారు. ఇంతకుముందు
లేదు లెండి నా బ్లాగ్ లో. థ్యాంక్ యు. :)