Dec 19, 2007

స్వాతిముత్యం

గాత్రం:బాలు,జానకి

పల్లవి:

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబొయ్
అమ్మ నన్ను తిట్టింది బాబొయ్
ఊరుకో నా నాన్న నిన్ను ఊరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారమ్మ

చరణం1:

నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక
తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో
అమ్మా మన్ను తినంగా నే చిచువును ఆకొంతిను వెతును చూడు నోరు ఆ
వెర్రిది అమ్మేరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వెర్రిది అమ్మేరా పిచ్చిదామే కోపం రా
పచ్చికొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా
ఉం ఉం ఉం ఎడుపొత్తుంది నాకు ఎడుపొత్తుంది
పచ్చికొట్టిపోయామా పాలవాడు వింటాదు
బూచికిచ్చిపోయేమా బువ్వెవరు పెడతారు చెప్పు
అమ్మతోనే వుంటాము అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొట్టు అమ్మా కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు కొట్టు
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారు నాన్న ఎవలమ్మ

చరణం2:

చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడునైతే బుద్దిమతి నేర్పేను
యశోదను కానురా నిను దండించ
సత్యను కానురా నిను సాధించా
ఎవ్వరు నువ్వనీ ఈ ఈ ఈ ఈ ఈ
ఎవ్వరు నువ్వనీ నన్ను అడుగకు
ఎవరు కానని విడిచి వెళ్ళకు
నన్ను విడిచి వెళ్ళకు
ఆ వెళ్ళము వెళ్ళములేమ్మ

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబొయ్
అమ్మ నన్ను తిట్టింది బాబొయ్
ఊరుకో నా నాన్న ,ఆహా ఊరుకోను
నిన్ను ఊరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య

Get this widget | Track details | eSnips Social DNA

No comments: