Dec 31, 2007
పడమటి సంధ్యారాగం
పల్లవి:
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే
యూ ఆవకాయ్ మి ఐస్ క్రీం దిస్ ఇజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్స్ డ్రీంస్
యునైటడ్ స్టేట్స్ ఆఫ్ హాట్ స్వీట్ హార్ట్ లైక్ ఇండియన్ నమస్తే
చరణం1:
ఆకశంలో తార సుడిగాలికారని దీపం
గుడిలేని దైవం కోసం ఒడిచేరుకున్నదిలే
సాగరంలో కెరటం ఉప్పొంగిన నా హృదయం
అలిసేది కాదనురాగం ఈ జన్మ సంగీతం
గ్రహణాలు లేని ఆ తారలన్ని
గగనాన కలిసి ఈవేళలోని
కలిసింది ఈ బంధం
కలిసింది ఈ బంధం
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే
చరణం2:
చైత్ర కోయిలలెన్నో మైత్రి వేణువులూదె
మనసైన మాటల కోసం మౌనాల ఆశలు పూసే
ఏడేడు రంగుల దీపం ఆ నింగిలో హరిచాపం
అరుణాల రుధిరంతోనే రుణమైనదీ ప్రియబంధం
ఏ దేశమైన ఆకాశ మొకటే ,ఏ జంటకైన అనురాగ మొకటే
అపురూపమీ ప్రణయం ...అపురూపమీ ప్రణయం
ఈ తూరుపు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ
పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే
యూ ఆవకాయ్ మి ఐస్ క్రీం దిస్ ఇజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్స్ డ్రీంస్
----------------------------
-----------------------------
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment