Dec 16, 2007

మంచుపల్లకి

తారాగణం:చిరంజీవి,సుహాసిని,రాజేంద్రప్రసాద్,నారాయణరావు
గాత్రం:జానకి
సంగీతం:రాజన్-నాగేంద్ర
దర్శకత్వం:వంశీ
సంస్థ:గోదావరి చిత్ర
విడుదల:1982



పల్లవి:

మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం

చరణం1:

మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచు పల్లకిగా
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం

చరణం2:

పెనుగాలికి పెళ్ళి చూపు
పువ్వు రాలిన వేళా కల్యాణం
అందాకా ఆరాటం ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ఓ ఓ ఓ ఓ
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: