గాత్రం:ఘంటసాల,సుశీల
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:సి.నారయణరెడ్డి
నిర్మాత:డి.మధుసూధనరావు
దర్శకత్వం:ఆదుర్తి సుబ్బారావు
సంస్థ:అన్నపూర్ణా పిక్చర్స్
విడుదల:1963
పల్లవి:
కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల
చరణం1:
రమ్మని మురళీరవమ్ములు పిలిచే
రమ్మని మురళీరవమ్ములు పిలిచే
అణువణువున బృందావని తోచే
తలతలలాడె తరగలపైన అందీ అందని అందాలు మెరిసే
కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ
చరణం2:
నీవున్న వేరె సింగారములేల
నీవున్న వేరె సింగారములేల
నీ పాదధూళి సింధూరము కాదా
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కల్యాణి నీవే
కరగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల
చరణం3:
నీ కురులే నన్ను సొకిన వేళ
నీ కురులే నన్ను సొకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ
కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ
కిలకిల నవ్వులు చిలికిన
|
No comments:
Post a Comment