గాత్రం:వాణిజయరాం
పల్లవి:
కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లో
కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లో
కోరి కోరి కూసింది కొయిలమ్మ
కోరి కోరి కూసింది కొయిలమ్మ ఈ కొయిలమ్మా
కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లో
గోదారి గంగమ్మ ఛాయల్లో
చరణం1:
నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వయి మోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వయి మోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా
ఊపిరి ఊయల లూగంగా రేపటి ఆశలు తీరంగ
తెనుగుదనము నోరూరంగా తేటగీతి గారాబంగ
తెనుగుదనము నోరూరంగా తేటగీతి గారాబంగ
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా
కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లో
గోదారి గంగమ్మ ఛాయల్లో
చరణం2:
ఝుమ్మని తుమ్మెద తీయంగ కమ్మని రాగం తీయంగా
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగా జానపదాలే నింపంగా
చెట్టుపుట్ట నెయ్యంగా చెట్టపట్టా లేయ్యంగా
చెట్టుపుట్ట నెయ్యంగా చెట్టపట్టా లేయ్యంగా
చిలకా పలుకులు చిత్రంగా చిలికె తేనెలు చిక్కంగా
ఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగా
ఏటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించగ సావాసంగ
కొండాకోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా ఛాయల్లో
లోయల్లొ ఛాయల్లో లోయలో ఛాయల్లో
No comments:
Post a Comment