Jan 20, 2008

ఏకవీర(1969)

గాతం:సుశీల,బాలు


పల్లవి:

కృష్ణా......
నీ పేరు తలచినా చాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు

చరణం1:

ఏమి మురళి అది ఏమి రవళిరా ఆ ఆ ఆ
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ సరళహరులలో మరణమైన మధురమురా
నీ పేరు తలచినా చాలు

చరణం2:

వెదురుపొదలలో తిరిగితిరిగి నీ పదపల్లవములు కందిపోయెనో
వెదురుపొదలలో తిరిగితిరిగి నీ పదపల్లవములు కందిపోయెనో
ఎదపానుపుపై పవళైంచరా నా పొదిగిన కౌగిట పులకించరా
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు

గోపాల నందబాల నవమంజుల మురళిలోల
మృదు సమీరకంపిత మనొజ్ఞకుంతల సమాలపల్లవజాల
కృష్ణా నీ పేరు తలచినా చాలు
ఏమి పిలుపు అది పిలుపు బృందానికుంజముల పూలు పూచి సర బిందు చంద్రికల చేయి చాచి
కరుణాంతరంగముల దాగి దాగి చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా ఆ ఆ
తొలకరించెరా ఆ ఆ
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
వల్లమీరమని చల్లని ఉల్లము అల్లన ఝల్లన పరవశించెరా ఆ ఆ ఆ
కృష్ణా నీ పేరు తలచినా చాలు

----------------------------------------------------

పాట ఇక్కడ వినండి

----------------------------------------------------

1 comment:

Dr.Suryanarayana Vulimiri said...

విహారి గారు. చక్కని పాటలు అందిస్తున్నారు. చాల సంతోషం. నీ పేరు తలచినా చాలు.. పాటలో కొన్ని తప్పులు దొర్లాయండి. అనేమిటంటే, మొదటి చరణంలో 'సరళహరులూ కు బదులు 'స్వరలహరులలో' అని ఉండాలి. రెండవ చరణంలో "పవళైంచరా" కు బదులు "పవళించరా" అని, "సర బిందు" కు "శరబిందు" అని ఉండాలి.