Jan 20, 2008

చెంచులక్ష్మి

గాత్రం: సుశీల




పల్లవి:

పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా
బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావ
బాలుని నను దయపాలించుటకై కనుపించేవా మహానుభావ
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా

చరణం1:

అలకలు అల్లలలాడుతు ముసరగ
అలకలు అల్లలలాడుతు ముసరగ
నెలనవ్వులు పులకించే మోము
నెలనవ్వులు పులకించే మోము
చెలి కన్నుల కరుణారసవృష్టి
చెలి కన్నుల కరుణారసవృష్టి
తిలకించిన మది పులకించే స్వామి
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా

చరణం2:

ఆదిలక్ష్మి నీ పాదములొత్తగ
వేదమంత్రములు విరించి చదువ
ఆదిలక్ష్మి నీ పాదములొత్తగ
వేదమంత్రములు విరించి చదువ
నారదాది ముని ముఖ్యులు చేరి ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ
నారదాది ముని ముఖ్యులు చేరి
మోదమలర నిను గానముసేయ
పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: