సాహిత్యం: దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
గాత్రం:జేసుదాసు
పల్లవి:
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
చరణం1:
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
మదిలోన గదిలోన
మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
చరణం2:
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు మధువుకై మెదలు తుమ్మెదలు
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
---------------------------------------------------
పాట ఇక్కడ వినండి
3 comments:
wooow పాటకి వీడియో లింక్ ఇచ్చారు. మంచి ఆలోచన విహారి గారు :)
కాకపోతే ఒక చిన్న సలహా...లింక్ క్లిక్ చేసినప్పుడు పాట వేరే విండో లో
ఓపెన్ అయ్యేట్టుగా పెడితే బాగుంటుంది, వింటూ లిరిక్స్ చూడ్డానికి ఇష్టపడతారు చాలా మంది.
మీ బ్లాగ్ లో లేని పాట అంటూ వుండదేమో కొన్నాళ్ళకి :) tooo good work, keep going Vihari garu.
thanks brundavani garu.
meeda ee blog vihari gaaru......excellent collection
Post a Comment