Jan 20, 2008

గృహలక్ష్మి

గాత్రం:భానుమతి


పల్లవి:

లాలి లాలి గోపాలబాల లాలి
పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి
మేడ మీద బూచివాడు జాగుచేస్తే వచ్చేస్తాడు
జాలి తలచి పవళించవయ్య చల్లనయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి

చరణం1:

బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
బొజ్జనిండ పాలారగించి సెజ్జమీద బజ్జోవయ్య
వింతకధనే చెపుతా నీకు నీవు వింటే అంతే చాలు
కధకు మూలం నీవే కదయ్య చక్కనయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి

చరణం2:

నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నిండుజాబిలి తారాడసాగే నీటకలువ నింగి చూసే
నీలమేఘం నడుమ నిలిచే నీకు నిదుర రానేరాదా
తెల్లవారే వేళాయెనయ్య నల్లనయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి
పొద్దుపోయే నిదురించవయ్య ముద్దులయ్య
లాలి లాలి గోపాలబాల లాలి లాలి

||

No comments: