Jan 20, 2008
ప్రేమ
పల్లవి:
ఊ ఊ ఊ ఊ
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది అందాలలోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది
చరణం1:
నింగి నేల ఏకంకాగ ఈక్షణమిలాగే ఆగింది
నింగి నేల ఏకంకాగ ఈక్షణమిలాగే ఆగింది
ఒకటే మాటన్నది ఒకటై పొమ్మన్నది
మనసే ఇమ్మన్నది అది నా సొమ్మన్నది
పరువాలు మీటి న న న న న సేలయేటి తోటి న న న న న
పాడాలి నేడు న న న న న కావాలి తోడు న న న న న న న న న న
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది
చరణం2:
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది
పగలు రేయన్నది అసలే లేదన్నది
కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది
ఎదలోని ఆశ న న న న న ఎదగాలి బాసై న న న న న
కలవాలి నీవు న న న న న కరగాలి నేను న న న న న న న న న న
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది అందాలలోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలో జరగంది
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment