Feb 14, 2008

పెళ్ళికానుక(1960)

గాత్రం:జిక్కి

పల్లవి:

పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
గానం మనసునే మరపించు
పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
గానం మనసునే మరపించు

చరణం1:

రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగమొలికి రక్తి నొసగును గానం
రేపురేపను తీపి కలలతో రూపమిచ్చును గానం
చెదరి పోయే భావములను చేర్చి కూర్చును గానం
జీవమొసగును గానం మది చింత బాపును గానం

పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
గానం మనసునే మరపించు

చరణం2:

వాడి పోయిన పైరులైనా నీరు గని నర్తించును
వాడి పోయిన పైరులైనా నీరు గని నర్తించును
కూలిపొయిన తీగలైన కొమ్మ నలమి ప్రాకును
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియు
దోర వలపే కురియు మది దోచుకొమ్మని పిలుచు

పులకించని మది పులకించు వినిపించని కధ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
ప్రేమ మనసునే మరపించు

||

No comments: