Feb 2, 2008

అనుబంధం




పల్లవి:

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో జోడుంది వయసులో
బోలెడంత కొరెకుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

చరణం1:

నీ చిలిపి నవ్వులో ఆ నవ్వు వెలుగులో
నా సొగసు ఆరబోసి మెరిసిపోనా
నీ ఒంటి నునుపులో నీ పెదవి ఎరుపులో
నా వయసు పొంగు నేను కలుపుకోనా
గంగలాగ ఉరికిరానా
కడలిలాగ కలుపుకోనా
నా ఒడిలో ఉయ్యాలలూగించనా
నా ఎదకు నిను చేర్చి జోకొట్టనా
నీతోటి బ్రతుకంత ఒక వింత గిలిగింత అనిపించి మెప్పించి మురిపించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా

చరణం2:

నీ ముద్దు ముద్దులో మురిపాల సద్దులో ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా
నీ మెత్త మెత్తని సరికొత్త మత్తులో నీ చిత్త చిత్తరంగ హత్తుకోనా
హోయ్ గుండెలోనా నిండిపోనా
నిండిపోయి ఉండిపోనా
నీ ప్రేమ నూరేళ్ళు పండించనా
నీ ఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా
బంధాలు ముడివేసి అందాల గుడిచేసి అనురాగ అర్చనలే చేపించుకోనా

మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
చల్లగాలి గిల్లుతున్నది సంబరాన
ఎర్రాని పెదవిలో బిర్రైన వయసులో
బోలెడంత కోరికుంది తీర్చుకోనా
మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన
వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన
వేడుంది ఒంటిలో జోడుంది వయసులో
బోలెడంత కొరెకుంది తీర్చుకోనా

-----------------------------------------------



----------------------------------------------

No comments: