సాహిత్యం:దాశరథి
పల్లవి:
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
చరణం1:
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసిందీ
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
చరణం2:
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెరటాల వెలుగు చెంగలువా నెల రాజు పొందు కొరేను
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
చరణం3:
రాధలోని అనురాగమంత మాధవునిదేలే
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
|
No comments:
Post a Comment