Feb 6, 2008

ఆత్మబంధం

గాత్రం:చిత్ర,బాలు


పల్లవి:

ఊరుకో ఊరుకో బంగారు కొండ
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మని
చేయి జారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారు కొండ
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా

చరణం1:

ఇంకిపోని గంగలా కంటి నీరు పొంగినా చల్లబడకుంది ఎడారి
ఎదలో జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా గుండె ఊపిరింకా మిగిలుంది
చల్లని నీ కళ్ళలో కమ్మని కల నేను
చెమ్మగిల్లనీయకుమా కరిగిపోతాను
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మని
చేయి జారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారు కొండ
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా

చరణం2:

గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గు పట్టవేమని పట్టుపట్టి తిట్టేవారేరి
తండ్రి అమ్మ ఒట్టి మొద్దురా జట్టు వుండొద్దురా అంటూ ఊరడించే నాన్నేడి
చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేనని
జన్మలెన్ని దాటైనా చేరుకుంటానని
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మని
చేయి జారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా

ఊరుకో ఊరుకో బంగారు కొండ
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దమ్మని
చేయి జారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా

||

No comments: