పల్లవి:
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో
చరణం1:
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో
చరణం2:
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలము
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలము
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
|
No comments:
Post a Comment