గాత్రం:బాలు,సుశీల
సాహిత్యం:సి.నారాయణరెడ్డి
పల్లవి:
ఎంత దూరమో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
పరిమలించు పానుపులకు నిరీక్షిణ్చు చూపులకు
వేసిన తలుపులకు వేచిన తలపులకు
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
చరణం1:
ఉదయనించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు
కలలుగనే చెలునికి కలతపడే చెలియకు
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
చరణం2:
మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి
మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి
ఉన్నదానికి అనుకున్నదానికి
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
చరణం3:
అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు
అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు
మరువరాని అందానికి చెరిగిపోని బంధానికి
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
-------------------------------------------------
పాట ఇక్కడ వినండి
------------------------------------------------
1 comment:
విహారి గారు చాట్ బాక్స్ ఒకటి ఈ బ్లాగ్ లో పెట్టారంటే ఎవరైనా వారికి ఇష్టమైన పాటలు అడగటానికి అది ఉపకరిస్తుంది.
Post a Comment