పల్లవి:
తెలిసిందా బాబు ఇపుడు తెలిసిందా బాబు
తెలిసిందా బాబు ఇపుడు తెలిసిందా బాబు
అయవారు తెలిపే నీతుల ఆలించకపోతే వాతలే
తెలిసిందా బాబు ఇపుడు తెలిసిందా బాబు
నీకు తెలిసిందా బాబు
చరణం1:
అల్లరి పిల్లల కూడవుగా గిల్లికజ్జాలాడవుగా
ఓ ఓ ఓ ఇక వేయవుగా ఈతలు
తెగ కోయవుగా నా కోతలు
కోతేమిటో కూతేమిటో నీకు ఇపుడైనా తెలిసిందా బాబు
ఇపుడు తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు
చరణం2:
చదువుకు సున్నా చుట్టవుగా గురువుకు నామం పెట్టవుగా
పొరపాటున పనికి పోవుగా మరియాదకు లోటు చేవుగా
కోతేమిటో కూతేమిటో నీకు ఇపుడైనా తెలిసిందా బాబు
ఇపుడు తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు
చరణం3:
వినయము మీర తల్లి పదాలను దినము కొలవాలి
ఆహా దినము కొలవాలి
మనసున చెల్లెలి మాట మరువక మన్నన చేయాలి
ఆహా మన్నన చేయాలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఇరుగుపొరుగు శెభాషన పరువెరిగి నీవు మెలగాలి
మన ఊరికి మనవారికి పేరు తేవాలి
తెలిసిందా బాబు
ఇపుడు తెలిసిందా బాబు నీకు తెలిసిందా బాబు
|
No comments:
Post a Comment