Mar 27, 2008

పూజాఫలం

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి



పల్లవి:

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీయసాగెనెందుకో
తీయసాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

చరణం1:

పూచిన ప్రతి తరువొక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాలీ శోభలన్ని ఎచట దాగెనో ఓ ఓ
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

చరణం2:

చెలినురుగులె నవ్వులు కాగా, సెలయేరులు కులుకుచు రాగ
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే ఏ ఏ
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

చరణం3:

పసిడి అంచు పైట జార ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహొ
పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: