Mar 27, 2008

స్వాతి చినుకులు




పల్లవి:

ఉం ఉం ఉం ఉం లలలా లల లలలలా లలాలల
నిన్ను కన్నా మనసు విన్నా
ఎదలో మోహనాలాపన
నీడలోనా వెలుగులోనా
అనుబంధాల ఆరాధన
నాకు నీవు నీకు నేను తోడు వుందాము ఏడేడు జన్మలెత్తినా
నిన్ను కన్నా మనసు విన్నా
ఎదలో మోహనాలాపన
నిన్ను కన్న

చరణం1:

నీ కళ్ళు పాడేటి కధలు అధరాలలో పొంగు సుధలు
ఇటు ప్రేమించుకున్నాక ఎదలు పేరంటమాడేటి పొదలు
చేమంతిపూల సీమంతమాడే
హేమంత వేళ ఈ రాసలీల
వెయ్యేళ్ళ వెన్నెల్లు కాయాలిలే

నిన్ను కన్నా మనసు విన్నా
ఎదలో మోహనాలాపన
నాకు నీవు నీకు నేను తోడు వుందాము ఏడేడు జన్మలెత్తినా
నిన్ను కన్నా మనసు విన్నా

చరణం2:

కౌగిల్లలో పండు కలలు వేవిళ్లలో దాటు నెలలు
బిగిసందిళ్లకేటందు కలలు సందేల మందార గెలలు
రాసేదికాదు ఈ చైత్రగీతం రాగాలు తీసే ఈ ప్రేమవేదం
పూలారబోసింది ఈ తోటలో

నిన్ను కన్నా మనసు విన్నా
ఎదలో మోహనాలాపన
నీడలోనా వెలుగులోనా
అనుబంధాల ఆరాధన
నాకు నీవు నీకు నేను తోడు వుందాము ఏడేడు జన్మలెత్తినా
నిన్ను కన్నా మనసు విన్నా
ఎదలో మోహనాలాపన
నిన్ను కన్న

||

No comments: