Apr 4, 2008

భైరవద్వీపం

గాత్రం:బాలు


పల్లవి:

శ్రీతుంబుర నారద నాదామృతం ఆ ఆ ఆ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

చరణం1:

సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
సపస దరిసనిదపమగ నిస మగరిసనిస సగమ గమప మపనిస గరిసని గరిసని సనిదప సనిదపమ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
స స ససస గనిపగరిస గపరిస గరిసర నిసరి పనిస గపరి గరిస
సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప మగరి నిగప మగరి
శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే
గ గా గారిస రిసగ సగప గగపదస
మురళి వనాంతాల విరుయు వసంతాల
మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
స సమగసనిదమ సమగ మదని మదనిసస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శికరాన కలశము హిందోళ మధ్యమమే
ప పమపసగప పమసనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
ద దనిసమగని పదనిరిసమగ రిసరిగదమప రిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గనిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె విషాదమే.........................................

శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

||

2 comments:

Anonymous said...

మీకు సర్వధారి నామ ఉగాది శుభాకాంక్షలు.

-- విహారి

G S Venugopal said...

అద్భుతః