గాత్రం:ఘంటసాల
సాహిత్యం:ఆత్రేయ
పల్లవి:
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
ఏరులా సేలయేరులా కలకల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
ఏరులా సేలయేరులా కలకల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర
చరణం1:
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కోప్పులోని ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కోప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాలవలే నాలో పలికినది పలికినది పలికినది
చల్లగా చిరుజల్లుగా జలజల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
చరణం2:
రెక్కలోచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
రెక్కలోచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెనో రూపాలు వెలసినవి వెలసినవి వెలసినవి
వీణలా నెరజాణల కలకల గలగల
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనులముందర
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
-------------------------------------------
పాట ఇక్కడ వినండి
--------------------------------------------
No comments:
Post a Comment