గాత్రం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ
పల్లవి:
శ్రీరామ జయ రామ సీతారామ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ
నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ
చరణం 1:
చరణాలు కొలిచే నగుమోము జూచే ఆ ఆ ఆ
చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీరామ జయ రామ సీతా రామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతా రామ
చరణం 2:
నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ
--------------------------------------------
పాట ఇక్కడ వినండి
--------------------------------------------
1 comment:
నమస్తే విహారి గారు ____/\____
మీ BLOG చాలా చాలా బావుందండి :)
మీ శ్రమకి జోహార్లు ......
మీకు TIME వున్నప్పుడు నా BLOG చూడండి
మీరు ,నేను ఒకే పేరు పెట్టాము తెలియకనే మన BLOG కి
ok BYE మళ్ళి కలుద్దాం :)
మీ BLOG అంత నా BLOG బాగోలేక పోయినా
ఏదో నా త్రుప్తికి రాస్తున్నా నాకు పాటలంటే మహా పిచ్చి :)
బోలేడు తెలుగు movies కొంటాను అందుకే :)
ok BYE మళ్ళి కలుద్దాం :)
http://animutyaalu.blogspot.com/
Post a Comment