గాత్రం:ఘంటసాల
సాహిత్యం:సముద్రాల
పల్లవి:
ద్వారపాలుర మరల దరినీయ కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాధారం దుర్జన హృదయవిదారం
రాముని అవతారం
చరణం1:
ధాశరదుడిగా శ్రీకాంతుడు వెలయు
కౌసల్యా సతి తపము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరత
రాముని అవతారం రవికుల సోముని అవతారం
చరణం2:
చదువులు నేరుచు మిషచేత శపము దాలిచి చేత
విశ్వామిత్రుని వెనువెంట యాగము కావగ తనునంట
అంతము చేయును అహల్యకు శాపము
అంతము చేయును అహల్యకు శాపము
ఒసగును సుందర రూపం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
చరణం3:
తనువో జనకుని మనసున భయమో
దారుని కన్యా సంశయమో
ధనుజులు కలుగను సుఖగోపురమో
ధనుజులు కలుగను సుఖగోపురమో
విరిగెను మిధిలానగరమున
రాముని అవతారం రవికుల సోముని అవతారం
చరణం4:
కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలిక శోకం
భీకర కాననవాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరిక తీరుచుకోసం పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరిక తీరుచుకోసం పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవనవ సంతోషం
పురజన సేవకు ఆదేశం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
చరణం5:
అదిగో చూడుము బంగరు జింక
అదిగో చూడుము బంగరు జింక
మన్నై కనును అయ్యో లంక
హరనయనాగ్ని పరాంగన వంక
అది విన మరణమె నీకింక
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కులపుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కులపుంగవ హనుమా
ముద్రిక సాహితి భువన నిదానం
ముద్రిక సాహితి భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం
జీవన్ముక్తికి సోపానం
రామ రామ జయ రామ రామ
జయ రామ రామ రఘుకుల సోమ
సీతా శోక వినాశనకారి లంకా వైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబవునిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మవిచారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
----------------------------------------------
పాట ఇక్కడ వినండి
----------------------------------------------
No comments:
Post a Comment