Apr 19, 2008

గుండమ్మ కధ

గాత్రం: ఘంటసాల,పి.సుశీల

పల్లవి:

కోలో కోలో యన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు
కోలో కోలో యన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలు మేలో యన్న మేలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు
మేలు మేలో యన్న మేలో నా రంగ కొమ్మలకు వచ్చింది ఈడు
ఈ ముద్దుగుమ్మలకు చూడాలి జోడు
కోలో కోలో యన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు

అహాహా... ఆ ఆ ఆ ఆ ఆ
ఓహోహో... ఓ ఓ ఓ ఓ ఓ

చరణం 1:

బాల బాలో యన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
బాల బాలో యన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల
ఓహొహోహొహో...
బేల బేలో యన్న పెద్దమ్మి చిలకలా కులికేను చాలా ఆ ఆ ఆ
బేల బేలో యన్న...
జిజ్ఝినకఝిన జిజ్ఝినకఝిన జిజ్ఝినకఝినఝిన్ హోయ్
బేల బేలో యన్న పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
ఈ బేల పలికీతె ముత్యాలు రాల

కోలో కోలో యన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు

అహాహా... ఆ ఆ ఆ ఆ ఆ
ఓహోహో... ఓ ఓ ఓ ఓ ఓ

చరణం 2:

ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచీదె పాపం
ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమో మంచీదె పాపం
ఓహోహో...
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం
ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం
జంటుంటె యెందు రానీదు యే లోపం

కోలో కోలో యన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మాంచి జోడు
అహాహా... ఆ ఆ ఆ ఆ ఆ
ఓహోహో... ఓ ఓ ఓ ఓ ఓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: