Apr 19, 2008

గుండమ్మ కధ

తారాగణం : రామారావు,నాగేశ్వరరావు,ఎస్వి.రంగారావు, సావిత్రి,జమున,సూర్యకాంతం
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేశ్వరరావు
గాత్రం: ఘంటసాల
నిర్మాతలు : చక్రపాణి,నాగిరెడ్డి
దర్శకత్వం:కమలాకర కామేశ్వరరావు
సంస్థ : విజయా పిక్చర్స్
విడుదల : 1962

పల్లవి:

మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే నీ మనసు కనుగొంటిలే

చరణం 1:

కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే

ఆనందముతో అమ్రుతవాహిని ఓలలాడి మైమరచితిలే

మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

చరణం 2:

ముసిముసినవ్వుల మోముగని నను ఏలుకొంటివని మురిసితిలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ముసిముసినవ్వుల మోముగని నను ఏలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాసమని వెదరితిలే

మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే నీ మనసు కనుగొంటిలే
మౌనముగానే నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: