Apr 19, 2008

గుండమ్మ కధ

గాత్రం: పి.సుశీల

పల్లవి:

సన్నగ వీచే చల్లగాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై ఆ ఆ ఆ ఆ ఆ
కలలో వింతలు కననాయే
సన్నగ వీచే చల్లగాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపుపై
ఆ కలలో వింతలు కననాయే
అవి తలచిన ఎమొ సిగ్గాయే
కనులు తెరిచిన నీవాయే నే కనులు మూసినా నీవాయే

చరణం1:

నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి నే విననాయే
నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి నే విననాయే
కలవరపడి నే కనులు తెరువ నాకంటిపాపలో నీవాయే
ఎచట చూచినా నీ వాయే

కనులు తెరిచిన నీవాయే నే కనులు మూసినా నీవాయే
కనులు తెరిచిన నీవాయే

చరణం2:

మేలుకొనిన నా మదిలో ఏవొ మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో ఏవొ మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలియ వెతక నాహృదయఫలఖమున నీవాయే

కనులు తెరిచిన నీవాయే కనులు మూసినా నీవేనాయే

||

No comments: