గాత్రం:బాలు,సుశీల
పల్లవి:
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
హొయ్ పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం
నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
చరణం1:
నీవు నడిచే బాటలోన లేవు బాధలే ధనకధిం
నేను నడిచే బాట మీకు పూలపానుపులే ధనకధిం
ఒకటంట ఇక మనమంతా లేదంట చీకు చింత
సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసం
వీసమైన లేదులే బేధభావమే
నీకు నాకు ఎన్నడు నీతి ప్రాణమే
తాంతధిద్దిం ధింతధిద్దాం ఆడిపాడుతాం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం
నిలవాలి ఇది కలకాలం
చరణం2:
పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా ధనకధిం
ఆదరించే దైవముంది కళ్ళముందర ధనకధిం
పువ్వలతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించు
మమకారాన్ని పండించు అందరికి అది అందించు
వాడలోని వేడుకే తుళ్ళి ఆడెను
అంతులేని శోభలే చిందులేసెను
తాంతధిద్దిం ధింతధిద్దాం ఆడిపాడుతాం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం
నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment