Apr 18, 2008

తెనాలి రామకృష్ణ

తారాగణం: నాగయ్య,రామారావు,నాగేశ్వరరావు,భానుమతి,జమున,సంధ్య
గాత్రం:ఘంటసాల
సాహిత్యం: సముద్రాల
సంగీతం:విశ్వనాథన్-రామమూర్తి
దర్శకత్వం:బి ఎస్.రంగ
సంస్థ:విక్రం ప్రొడక్షన్స్
విడుదల:1956

పల్లవి:

చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఆ ఆ ఆ ఈ కోటలో
చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో
చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా
బాబయా చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో

చరణం1:

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగ బూసి వేలాదిగా
ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు
కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు
చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో

చరణం2:

రహ దారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
రహ దారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
భువిని తరతరలు నీ పేరు నిలుచురా
పని చేయువాడె ఫలములారగింతురా

చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయా
బాబయా చేసేది ఏమిటొ చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో

||

No comments: