Apr 18, 2008

ఇంటింటి రామాయణం

తారాగణం:రంగనాథ్,చంద్రమోహన్,జయసుధ,ప్రభ
గాత్రం:బాలు
సాహిత్యం:వేటూరి
సంగీతం:రాజన్-నాగేంద్ర
విడుదల : 1978
నిర్మాత: నవతా కృష్ణంరాజు
దర్శకత్వం: పి.సాంబశివరావు



పల్లవి:

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగ
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ

చరణం1:

ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై
ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై
మిసమిస వన్నెలలో మిలమిల మన్నవిలే నీ బిగికౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే
మనసులు పాడే మంతనమాడె ఈ పూట జంటగ

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగ
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ

చరణం2:

తొలకరి కోరికలే తొందరచేసినవె ఈవిరి సెయ్యకే ఆవిరి తీరగ
తొలకరి కోరికలే తొందరచేసినవె ఈవిరి సెయ్యకే ఆవిరి తీరగ
సొగసిరి కానుకలే సొదపెడుతున్నవిలే ఏ తెరచాటునో ఆ చెర వీడగ
అందిన పొందులోని అందలేని విందులేయవే
కలలిక పండే కలయిక నేడె కావాలి వేయిగ

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగ
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగ
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: