రారోయి మా ఇంటికి
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది
మాటున్నది మంచి మాటున్నది
చరణం1:
నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది
నువ్వు కూర్చుంటే కుర్చిలొ పీటున్నది
నువ్వు తొంగుంటే పట్టె మంచం పరుపున్నది
ఆహా భలే భలే
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది
చరణం2:
ఆకలేస్తే జొన్న బియ్యం కూడున్నది
నీకు ఆకలేస్తే జొన్న బియ్యం కూడున్నది
బాగుంది బాగుంది
అందులోకి అర కోడి కూరున్నది
ఆవుల్ రైట్ ఎరీ గుడ్
అందులోకి అర కోడి కూరున్నది
ఆపైన రొయ్య పొట్టు చారున్నది
అబ్బో అబ్బో హ హ
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది
చరణం3:
రంజైన మీగడ పెరుగున్నది
చీ చీ చీ
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
ఆ డోంట్ వర్రి
నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది
ఆ హహహా
రోగమొస్తే ఘాటైన మందున్నది
నిన్ను సాగనంపు వల్లకాటి దిబ్బున్నది
అహహహ ఓహొహొ
|
No comments:
Post a Comment