May 31, 2008

ప్రేమనగర్

గాత్రం:ఘంటసాల
సాహిత్యం:ఆత్రేయ



పల్లవి:

తాగితే మరిచిపొగలను తాగనివ్వరు
మరిచిపోతే తాగగలను మరువనివ్వరు
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసుగతి ఇంతే

చరణం1:

ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసుగతి ఇంతే

చరణం2:

అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయెనని తెలుసు
తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసుగతి ఇంతే

చరణం3:

మరు జన్మ వున్నదో లేదొ ఈ మమతలప్పుడేమౌతాయొ
మరు జన్మ వున్నదో లేదొ ఈ మమతలప్పుడేమౌతాయొ
మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నడు కక్షా
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసుగతి ఇంతే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: