గాత్రం: చిత్ర
పల్లవి:
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
చరణం1:
ఉడికించే చిలకమ్మ నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించె
ముత్యాల బంధాలే నీకందించె
అచట్లు ముచట్లు తానాశించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే
నీతో పొందు కోరెనె
ఉండాలని నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
చరణం2:
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కాని రాగసంగమం
నీ జ్ఞాపకం నాలోనే సాగేనులే ఈ వేల సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment