గాత్రం:ఘంటసాల,సుశీల
సాహిత్యం:శ్రీ శ్రీ
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత:మధుసూధనరావు.డి
దర్శకత్వం:కె.విశ్వనాథ్
సంస్థ:అన్నపూర్ణా పిక్చర్స్,జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల:1965
పల్లవి:
వలపులు విరిసిన పువ్వులే కురిపించె తేనియలే
మనసులు కలసిన చూపులే పులకించి పాడెలే
వలపులు విరిసిన పువ్వులే కురిపించె తేనియలే
చరణం1:
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు
చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు
వలపులు విరిసిన పువ్వులే కురిపించె తేనియలే
చరణం2:
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
నీ హృదయములో ఒదిగినచో బెదురింక ఏమ్మునది
వలపులు విరిసిన పువ్వులే కురిపించె తేనియలే
చరణం3:
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు
పెదవులపై మధురిమలే చిలికించమన్నాయిలే
ఓ వలపులు విరిసిన పువ్వులే కురిపించె తేనియలే
మనసులు కలసిన చూపులే పులకించి పాడెలే
|
No comments:
Post a Comment