గాత్రం:సుశీల
పల్లవి:
నోము పండించవా స్వామీ,నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా నిను కొలిచితిరా
అలక చాలించి పాలించవా
నోము పండించవా స్వామీ,నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా నిను కొలిచితిరా
అలకచాలించి పాలించవా
నోము పండించవా స్వామీ
చరణం1:
అనురాగమొలికే అందాలరాజుకు ఇల్లాలిగా చేసినావు
ఏవేళనైనా ఏఆపదైనా మమ్మెంతో కాపాడినావు
ఏడబాటు ఎరుగని మాజంట నిపుడు
ఏడబాటు ఎరుగని మాజంట నిపుడు ఎందుకు విడదీసినావు
నీవు ఎందుకు విడదీసినావూ
నోము పండించవా స్వామీ,నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా నిను కొలిచితిరా
అలకచాలించి పాలించవా
నోము పండించవా స్వామీ
చరణం2:
ఆదిశేషుని అవతారం నీవైతే
నేనింతకాలము నోచిన నోము నిజమైతే
ఆదిశేషుని అవతారం నీవైతే
నేనింతకాలము నోచిన నోము నిజమైతే
దైవంగ నాపతినే నేను పూజిస్తే
దైవంగ నాపతినే నేను పూజిస్తే
నీ మహిమను చూపాలి
మా కాపురం నిలపాలి
నిజం నిరూపించాలి
రావా దేవా రావా దేవా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment