Jul 15, 2008

సూర్యా I.P.S

గాత్రం:బాలు,చిత్ర



పల్లవి:

నెలరాజా ఇటు చూడరా
నెలరాజా ఇటు చూడరా
ఉలుకేలర కులుకేలర వలరాజా
తగువేలర తగువేళరా రవితేజ
నవరోజా తెర తీయవా
నవరోజా తెర తీయవా

చరణం1:

నీ కోసం ఆశగా నిరీక్షించె ప్రాణం
నీ చేతుల వాలగ చిగిర్చింది ప్రాయం
నీ వైపే దీక్షగా చెలించింది పాదం
నీ రూపే దీపమై ప్రయాణించే జీవం
నివాలిచ్చి నవనవలన్ని నివేదించనా
నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా
రతి రాజువై జత చేరవా
విరి వానవై నను తాకవా
నవరోజా తెర తీయవా
నవరోజా తెరతీయవా
దివి తారక నను చేరగ నిన్ను చూచా
జవనాలతో జరిపించవే జత పూజ
నెలరాజా ఇటు చూడరా
నెలరాజా ఇటు చూడరా

చరణం2:


ఈ వెన్నెల సాక్షిగా యుగలాగిపోని
ఈ స్నేహం జంటగా జగాలేలుకోని
నీ కనుల్ల పాపగ కలలు ఆడుకోని
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని
ప్రపంచాల అంచులుదాటి ప్రయాణించని
దిగంతాల తారలకోట ప్రవేశించని
గతజన్మనే బ్రతికించని
ప్రణయాలలో శ్రుతిపెంచని

నెలరాజా ఇటు చూడరా
నవరోజా తెర తీయవా
ఉలుకేలర కులుకేలర వల రాజా
జవనాలతో జరిపించవే జత పూజ
నెలరాజా ఇటు చూడరా
నవరోజా తెర తీయవా

||

1 comment:

Anonymous said...

విహారి గారు చాలా మంచి బ్బ్లాగండీ.reyally excellent work anDi, naa dO chinna kOrika mIku interest unTE mIru ee site ki template maarchi URL ni kooda change chesi Osite maintain chestE sooperO sooper