Jul 17, 2008

ప్రేమనగర్

గాత్రం:ఘంటసాల
సాహిత్యం:ఆత్రేయ



పల్లవి:

ఎవరి కోసం ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఈ భగ్న హృదయం ఈ అగ్ని గుండం
ఎవరి కోసం ఎవరి కోసం
ఎవరి కోసం ఎవరి కోసం

చరణం1:

ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగుల గొట్టి
పిచ్చి వాణ్ణి పాత్ర లేని భిక్షగాణ్ణి చేసావు
నువ్వివనిది తాకలేదు ఇంకెవ్వరిని అడుగలేదు
బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు
ఎవరి కోసం ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఎవరి కోసం ఎవరి కోసం
ఎవరి కోసం ఎవరి కోసం

చరణం2:

ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునాకలై పోని
కూలి పొయి ధూళి లో కలసిపోని కాలి పోయి బూడిదే మిగలనీ
ఎవరి కోసం ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఎవరి కోసం ఎవరి కోసం
ఎవరి కోసం ఎవరి కోసం

చరణం3:

మమత నింపమన్నాను మనసు చంపుకొన్నావు
మధువు తాగనన్నాను విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు
నీ విరహంలొ బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను
మరణిస్తాను ఎవరి కోసం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: