గాత్రం:బాలు
పల్లవి:
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోయె చంటి పాడే జోలలోనే
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
చరణం1:
కన్నతల్లి ప్రేమకన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దుకన్న వేరే ముద్దలేదు ఆకలికి
కన్నతల్లి ప్రేమకన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దుకన్న వేరే ముద్దలేదు ఆకలికి
దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డకన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బకూడా దీవెన
బువ్వపెట్టి బుజ్జగించే లాలనెంతో తీయన
మంచుకన్నా చల్లనైన,మల్లెకన్నా తెల్లనైన
అమ్మపాటే పాడుకోనా
మల్లెకన్నా తెల్లనైన అమ్మపాటే పాడుకోనా
మల్లెకన్నా తెల్లనైన అమ్మపాటే పాడుకోనా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment